Das ka dhamki Movie | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు దర్శకుడిగా సినిమాలు తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. గతేడాది ఈయన నటించిన ‘ఓరి దేవుడా’ రిలీజై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం అదే జోష్‌తో దాస్ కా ధమ్కీ చిత్రాన్ని రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నాడు. విశ్వక్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శివరాత్రికే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని బజ్ తెచ్చిపెట్టాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది.
ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్ల జోరు పెంచారు. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పాన్ ఇండియా హీరో రాబోతున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ధమ్కీ ప్రీ రిలీజ్ వేడుకకు తారక్ గెస్ట్‌గా రాబోతున్నాడట. ఇక విశ్వక్.. తారక్‌కు వీరాభిమాని ఎన్నో సార్లు స్వయంగా విశ్వకే చెప్పాడు. విశ్వక్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. విశ్వక్‌కు జోడీగా నివేథాపేతురాజ్ నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నాడు. లియాన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ‘నేను లోకల్’ ఫేమ్ ప్రసన్నకుమార్ బెజవాడ స్టోరీ అందిస్తున్నాడు.