‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన డైరీ నిండా పాన్ ఇండియా ప్రాజెక్టులే. బాలీవుడ్లో తారక్ నటించిన ‘వార్ 2’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, ప్రశాంత్‌నీల్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ ఏడాది ఆగస్ట్ 14న ‘వార్ 2’ విడుదల కానుండగా, వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ‘జైలర్’ఫేం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు తారక్.
ప్రస్తుతం ‘జైలర్2’ పనుల్లో బిజీగా ఉన్న నెల్సన్, ఆ ప్రాజెక్ట్ తర్వాత ఎన్టీఆర్ సినిమా పని మొదలుపెడతారు. వచ్చే ఏడాది చివర్లో గానీ, 2027 సంక్రాంతికి కానీ ఈ సినిమా విడుదల ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్‌తో చేయబోయే మైథాలజీ మూవీ ఉంటుందని తారక్ సన్నిహితుల సమాచారం. అంటే ఈ సినిమా 2028 నాటి ముచ్చటన్నమాట. మరి ఇన్ని పానిండియా ప్రాజెక్టుల మధ్య ‘దేవర 2’ మాటేంటి? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి ఈ రుణాన్ని తారక్ ఎలా తీర్చుకుంటారో చూడాలి.