Jr. NTR – Keshavanatheshwara Temple | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి మంగళూరు వెళ్లిన తారక్.. అక్కడ ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇక తారక్‌తో పాటు అతడి వెంట నటుడు రిషబ్ షెట్టితో పాటు సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉండడం విశేషం.
నేడు ఉదయం కెరాడిలోని ముదగల్లు కేశవనాథేశ్వరుడిని సతీసమేతంగా దర్శించుకున్నారు తారక్. ఇక వీరితో పాటు కాంతార నటుడు రిషబ్ షెట్టి దంపతలు, ప్రశాంత్ నీల్ దంపతులు ఉన్నారు. రిషభ్ శెట్టి ఇల్లు ఉన్న కెరడి గ్రామ సమీపంలో ఈ కేశవనాథేశ్వర ఆలయం ఉంటుంది. గుహలో ఈ ఆలయం ఉండడంతో పాటు ఈ ఆలయానికి వెళ్లాలి అంటే నీటిలో నుంచి నడుచుకుంటూ వెళ్లాలి. అయితే ఈ ఆలయంకు పంచెకట్టులో వచ్చి దర్శించుకున్నాడు ఎన్టీఆర్. దీనికి సంబంధించిన వీడియోను రిషబ్ షెట్టి ఎక్స్‌లో పంచుకున్నాడు.
ಮೂಡುಗಲ್ಲು ಕೇಶವನಾಥೇಶ್ವರನ ದರ್ಶನ ಪಡೆದಾಗ.. ✨🙏🏼
A blessed journey to Keshavanatheshwara Temple Moodagallu ✨🙏🏼@tarak9999 #PrashanthNeel pic.twitter.com/SWfP2TAWrk
— Rishab Shetty (@shetty_rishab) September 2, 2024
అంతకుముందు శనివారం తన అమ్మ కోరిక మేరకు ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంను దర్శించుకున్న తారక్ ఆదివారం కొల్లురులోని మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఉదయంపై పంచెకట్టులో ఆలయానికి వెళ్లిన తారక్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక తారక్‌తో పాటు నటుడు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ దంపతులు కూడా మూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Also Read..