Jr NTR Spotted with Lord Murugan Book | యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) అనే ప్రాజెక్ట్ చేస్తున్న తారక్ బాలీవుడ్ నుంచి వార్ 2 ని విడుదలకు సిద్ధం చేశాడు. ఈ చిత్రం ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా ప్రమోషన్స్ కోసం ముంబై నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ నుంచి వెళుతుండగా.. ఆయన చేతిలో ఉన్న ఒక పుస్తకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎయిర్పోర్ట్ నుంచి తారక్ వెళుతుంటే అతడి చేతిలో ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం రచించిన “మురుగ: ది లార్డ్ ఆఫ్ వార్, ది గాడ్ ఆఫ్ విస్డమ్ (Muruga: The Lord of War, The God of Wisdom) అనే పుస్తకం కనిపించింది. తారక్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో రానుండగా.. మురుగన్ కథతో రాబోతుంది. దీంతో ఈ సుబ్రహ్మణ్యుడి గురించి తెలుసుకుంటున్నాడు తారక్. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Jr NTR Returns for #War2! Spotted at Mumbai Airport Ahead of Song Shoot with Hrithik Roshan @tarak9999#JrNTR #HrithikRoshan #War2 #Bollywood #YRFSpyUniverse #JrNTRinWar2 #siima pic.twitter.com/APxqGKfoOH
— SIIMA (@siima) June 26, 2025
Read More