Pushpa-2 Movie | పుష్ప-2 సెట్లో జూనియర్ ఎన్టీఆర్.. ఫోటో వైరల్
Jr.Ntr Spotted Pushpa-2 Sets | మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్‌లో పుష్ప ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Jr.Ntr Spotted Pushpa-2 Sets | మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్‌లో పుష్ప ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మూవీ కోసం వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సెట్‌కు తారక్ వచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా మరోవైపు తారక్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్30 షూటింగ్ కూడా అక్కడే జరుగుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో పుష్ప-2 సెట్స్‌ను తారక్ సందర్శించినట్లు తెలుస్తుంది.
ఆ మధ్య బన్నీ బర్త్‌డేకు తారక్ పార్టీ లేదా పుష్ప అని కామెంట్ చేయడం.. దానికి బన్నీ వచ్చేస్తున్నా అని రిప్లై ఇవ్వడం వంటివి వాళ్ల మధ్య బాండింగ్ ఎలాంటిదో స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు తారక్ సెట్స్‌కు రావడంతో ఇద్దరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది.
ఇక గతేడాది డిసెంబర్లో విడుదలైన పుష్ప ది రైజ్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ దగ్గర రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అల్లుఅర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రం ఎలాంటి ప్రమోషన్లు చేయకుండానే రూ.100 కోట్ల నెట్ సాధించి అక్కడి విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.
Today @tarak9999 Visited @alluarjun‘s and #Sukumar blcokbuster sequel #Pushpa2TheRule Sets At RFC 🔥 #JrNTR #AlluArjun #Pushpa2 pic.twitter.com/R803SGwhQz
— CHITRAMBHALARE.IN (@chitrambhalareI) April 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

