Mowgli Teaser | టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు, యువ నటుడు రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మౌగ్లీ 2025’ (Mowgli 2025). ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సినిమాలో రోషన్ సరసన సాక్షి సాగర్ మదోల్కర్ (Sakshi Sagar Mhadolkar) నటిస్తున్నారు. వైవా హర్ష ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. కాలా భైరవ సంగీతం అందిస్తున్నాడు.