NTR Latest Interview | రెండు రోజుల్లో జరుగబోయే ఆస్కార్ వేడుకల కోసం తెలుగు ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ‘నాటు నాటు’ పాటకు ఖచ్చితంగా ఆస్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘ఆర్ఆర్ఆర్’ నుంచి నాటు నాటు పాట ఆస్కార్‌ను నామినేట్ అయింది. దీంతో గతకొన్ని రోజుల నుంచి ట్రిపుల్ ఆర్ బృందం అమెరికాలో సందడి చేస్తుంది. రాజమౌళి, చరణ్ ఇప్పటికే పలు హాలీవుడ్ మీడియాలకు వరుసగా ఇంటర్వూలు ఇస్తూ ఆర్ఆర్ఆర్ గురించి, నాటు నాటు పాట గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ఇక తాజాగా ఈ జాబితాలోకి తారక్ చేరాడు. ఇటీవలే తారక్ ఆస్కార్ అవార్డుల కోసం అమెరికాకు వచ్చాడు. వచ్చి రాగానే ప్రమోషన్లను మొదలుపెట్టాడు.
తారక్ తాజాగా ‘ఎంటర్టైనమెంట్ టు నైట్’ అనే హాలీవుడ్ మీడియాకు ఇంటర్వూ ఇచ్చాడు. ఇంటర్వూలో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి, నాటు నాటు సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. రెడ్ కార్పెట్‌పై నడిచేది మేము కాదని, యావత్ భారతదేశం అని తారక్ వెల్లడించాడు. ఆస్కార్ వేడుకలలో పాల్గొంటున్నప్పుడు మా గుండెల్లో మా దేశాన్ని మోయబోతున్నాం. అందుకు మేము గర్వంగా ఫీల్ అవుతాము అంటూ తెలిపాడు. అంతేకాకుండా నాటు నాటు పాట గురించి మాట్లాడుతూ ‘ఈ సాంగ్ షూట్ చేసినన్ని రోజులు సెట్ లో రిహార్సిల్ చేశాం. ఆ తర్వాత డైలీ మూడు గంటలు ప్రాక్టీస్ చేశాము. డ్యాన్స్ కంటే కూడా సింక్ కోసం ఎక్కువ ప్రాక్టీస్ చేశాము. నేను, చరణ్ స్టెప్స్ సింక్ చేయడానికి చాలా సమయం పట్టేది. ఈ సాంగ్ సమయంలో నా కాళ్ళు బాగా దెబ్బతిన్నాయిని, నాటు నాటు పాటకు డ్యాన్స్ చేయడం చాలా కష్టతరమైనదని’ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
#RRR star @tarak9999 will carry his "nation in [his] heart" as he walks the #Oscars red carpet this Sunday. pic.twitter.com/mwWhDvI3KZ
— Entertainment Tonight (@etnow) March 10, 2023