హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, పురందేశ్వరి అంజలి ఘటించారు. తన సోదరుడు కల్యాణ్‌రామ్‌తో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన ఎన్టీఆర్.. నవరస నటసార్వభౌముడికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. తాతను స్మరించుకున్నారు.
అంతకుముందు మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
— Jr NTR (@tarak9999) May 28, 2024
పార్టీ నాయకులతో కలిసి తన తండ్రికి నివాళులర్పించిన బాలకృష్ణ.. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనమని, నవరసాలకు అలంకారమని చెప్పారు. ఆ మహానుభావుడు నటకు విశ్వవిద్యాలయమని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఎంతోమంది అందిపుచ్చుకున్నారని వెల్లడించారు. తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ అని, రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ఒక పేరు, ఒక వ్యక్తి కాదని.. ఆయనొక సంచలనమని కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. చిత్రరంగంలో 320 సినిమాలకు పైగా నటించారని చెప్పారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముంద్ర వేసుకున్నారని తెలిపారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి నిరుపేదల కోసం సంక్షేమ పథకాలు తెచ్చారని వెల్లడించారు.
ఎన్టీఆర్ 101 జయంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ pic.twitter.com/8VKZY9jExN
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2024