ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) సినిమా అప్డేట్స్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందని వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ధృవీకరించింది. ఈ మేరక్ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ ప్రకటన విడుదల చేసింది.
‘ఈ నెల 20న ఎన్టీఆర్-నీల్ సినిమా ఫస్ట్‌గ్లింప్స్ విడుదల చేయబోతున్నాం. ఇంకా ఏడు రోజులు మాత్రమే’ అంటూ నిర్మాణ సంస్థ పేర్కొన్నది. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, టోవినో థామస్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. కల్యాణ్‌రామ్, నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.