Jr. NTR | ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత తారక్ నుంచి సినిమా రాలేదు. పైగా రాజమౌళీ సినిమా తర్వాత సినిమా అంటే, సదరు దర్శక, నిర్మాతలకు భయం, బాధ్యత రెండూ ఉండాల్సిందే. ఓ విధంగా దర్శకుడికి ఇది సవాల్. కొరటాల శివకైతే డబుల్ సవాల్. అందుకే కసితో తెరకెక్కిస్తున్నాడు ‘దేవర’ను. హీరోయిన్గా జాన్వీ కపూర్‌ని, విలన్‌గా సైఫ్ ఆలీఖాన్ని తీసుకున్నాడు. యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ నుంచి ఫైట్ మాస్టర్లను దింపాడు. తారక్‌తో ప్రమాదకరమైన విన్యాసాలే చేయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
తారక్ కూడా రాజీ లేకుండా కష్టపడుతున్నాడని యూనిట్ వర్గాల సమాచారం. కథ రీత్యా ఇందులో అండర్‌వాటర్‌లో ఫైట్ ఉంటుందట. దానికోసం రోజుల తరబడి శిక్షణ కూడా తీసుకున్నాడట తారక్. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయని తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. తారక్, జాన్వీల మధ్య కీలక సన్నివేశాలను కొరటాల తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘దేవర’ తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్5న విడుదల కానుంది.