అగ్ర హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలు ‘దేవర’ ‘వార్-2’ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. జూలైలోగా ఈ సినిమాలను పూర్తి చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా ఎప్పుడు మొదలవుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఏడాది క్రితమే ఈ సినిమా ప్రకటన వెలువడింది.
ఏప్రిల్‌లో సెట్స్‌మీదకు తీసుకురావాలనుకున్నారు. అయితే ఎన్టీఆర్ ‘దేవర’ ‘వార్-2’ చిత్రాలతో బిజీగా ఉండటంతో వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌మీదకు తీసుకెళ్తారని తెలిసింది. ‘కేజీఎఫ్’ ‘సలార్’ తరహాలోనే రెండు భాగాలుగా ఈ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఎన్టీఆర్ ‘దేవర’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.