శనివారం 06 జూన్ 2020
Cinema - May 03, 2020 , 00:01:35

బాలీవుడ్‌ ఎంట్రీ

బాలీవుడ్‌ ఎంట్రీ

పాన్‌ ఇండియన్‌ ట్రెండ్‌ పెరిగిన  తర్వాత టాలీవుడ్‌ కథానాయకులు ఇతర భాషల్లో తమ మార్కెట్‌ను విస్త్రతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ ఆ దిశగా అడుగులు వేయబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్‌లో ఆయన అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  రణ్‌వీర్‌సింగ్‌  హీరోగా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు తెలిసింది.   ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ప్రతినాయక ఛాయలతో ఆయన పాత్ర సాగనుందని  చెబుతున్నారు. ఎన్టీఆర్‌తో సంజయ్‌లీలాభన్సాలీ సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. కథ, తన పాత్రచిత్రణ నచ్చడంతో ఆయన ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌' ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. 


logo