అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ దాదాపు ఆరు నెలల విరామం తర్వాత ‘డ్రాగన్’ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే గత ఆరు నెలలుగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహంలో ఉన్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ ఈ సినిమా తాజా షెడ్యూల్ నేటి నుంచి హైదరాబాద్‌లో మొదలుకానుంది.
ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌తో పాటు కథానాయిక రుక్మిణి వసంత్ కూడా పాల్గొంటున్నదని, దాదాపు 20రోజుల పాటు జరిగే నైట్ షెడ్యూల్లో కీలక ఘట్టాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా తెరకెక్కిస్తారని సమాచారం. మరోవైపు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారని వార్తలొస్తున్నాయి. అందుకోసం స్క్రిప్ట్‌లో అవసరమైన మార్పులు చేశారని టాక్ వినిపిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.