Top 10 | సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎవరో ఒకరిపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లకు సంబంధించిన డిస్కషన్లు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (Twitter X) 2025 ఆగస్టు నెలకు సంబంధించి “ఇండియాలో మోస్ట్ టాక్డ్ పర్సనాలిటీస్” లిస్టును విడుదల చేసింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ టాప్ లో నిలవగా, ఆయన తర్వాతి స్థానంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.
ఆగస్టు 2025లో నెట్టింట హాట్ టాపిక్ అయిన సెలబ్రిటీలు – టాప్ 10 లిస్టు:
నరేంద్ర మోదీ – భారత ప్రధాని
జూనియర్ ఎన్టీఆర్ – టాలీవుడ్ స్టార్ హీరో
దళపతి విజయ్ – కోలీవుడ్ హీరో, రాజకీయ నాయకుడు
పవన్ కళ్యాణ్ – జనసేన అధినేత, సినీ నటుడు
శుభ్మన్ గిల్ – టీమిండియా టెస్ట్ కెప్టెన్
రాహుల్ గాంధీ – కాంగ్రెస్ నేత
విరాట్ కోహ్లీ – టీమిండియా మాజీ కెప్టెన్
మహేష్ బాబు – టాలీవుడ్ సూపర్ స్టార్
ఎంఎస్ ధోనీ – టీమిండియా లెజెండ్
రజనీకాంత్ – తమిళ సూపర్ స్టార్
ఈ టాప్ 10 లిస్టులో 5 మంది సినిమా స్టార్లు ఉన్నారు. విశేషంగా, బాలీవుడ్ నుంచి మాత్రం ఎవరూ లేరు. టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఉండగా, కోలీవుడ్ నుంచి విజయ్, రజనీకాంత్ నిలిచారు. అయితే ఎన్టీఆర్ ఎందుకు ట్రెండింగ్లోకి వచ్చాడంటే. ‘RRR’ తో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకున్న తారక్, ఇటీవల విడుదలైన ‘దేవర’తో మరో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్ చేస్తుండగా, ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఫిల్మ్ ‘వార్ 2’ ఆగస్టు నెలలో రిలీజ్ కావడం వల్ల నెట్టింట అతడిపై చర్చలు పెరిగాయి. తమిళ స్టార్ దళపతి విజయ్ తన రాష్ట్రీయ పార్టీని ప్రారంభించగా, ఇది ట్రెండింగ్ టాపిక్ అయింది. ఆయన త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘జన నాయకుడు’ సినిమా, ఆయన చివరి చిత్రం కానుంది అని ప్రచారం జరుగుతోంది.