Jr Ntr| యంగ్ టైగర్ చాలా కూల్ అండ్ కామ్‌గా కనిపిస్తుంటారు. కాని ఒక్కోసారి ఆయన చేసే తుంటరి పనులు, మాట్లాడే మాటలు కూడా ఎవరు మాట్లాడరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయి క్రేజ్ అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ బాలీవుడ్లో వార్ 2 చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరగడం ఖాయం. అయితే జూనియర్ తాజాగా ఫ్రిడ్జి, వాషింగ్ మిషన్‌లో దూరాడు. ఇది చూసిన వారు మన హీరో ఏంటి ఇలా చేస్తున్నాడని ఆశ్చర్యపోతున్నారు. అయితే యాడ్‌లో భాగంగా జూనియర్ ఇలా చేసినట్టు అర్ధమవుతుంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పటికే పలు యాడ్స్ చేయగా తాజాగా మరో కొత్త యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గ్రాసరీ సరుకులు సరఫరా చేసే ఆన్లైన్ బిజినెస్ జెప్టో కంపెనీ కోసం ఎన్టీఆర్ ఈ యాడ్ చేశారు. ఈ యాడ్‌లో ఎన్టీఆర్ నెలకి సరిపడా ఒకేసారి సరుకుల కొనుక్కొని పక్కింటి వాళ్లకు కూడా ధరలు తక్కువ ట్రై చేయండి అని చెప్పినట్టు వీడియోలో చూపించారు. అంతేకాదు ఎన్టీఆర్ ఫ్రిడ్జ్ లో కూర్చొని, వాషింగ్ మెషిన్ లో ఉన్నట్టు కూడా సరదాగా చూపించారు. ప్రస్తుతం ఫ్యాన్స్ ఎన్టీఆర్ కొత్త యాడ్ ని వైరల్ చేస్తున్నారు. సరదాగా నెటిజన్స్ వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సినిమానే ప్రపంచంగా భావిస్తూ అటు షూటింగులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ తాను లైఫ్‌ను లీడ్ చేస్తుంటారు.అవసరమైతే తప్పా బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోరు. జూనియర్ గత ఏడాది సెప్టెంబర్ 27న దేవర చిత్రంతో పలకరించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది.. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 550కోట్ల వరకు కలెక్ట్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుసగా సినిమాలను లైనప్ చేశారు. ప్రశాంత్ నీల్‌తో కూడా ఎన్టీఆర్ మూవీ చేయనున్నాడు.
Zepto Supersaver lo savings jathara inka modhalindi! pic.twitter.com/ZASSjLUOIh
— Zepto (@ZeptoNow) March 7, 2025