NTR | ప్రముఖ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తారక్, తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమాతో బిగ్ స్క్రీన్‌పై సందడి చేశాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్‌తో సినిమాలు చేసేందుకు అనేక మంది దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం పూర్తిగా ప్లాన్డ్ మేనర్లో మాత్రమే ప్రాజెక్ట్స్‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన హోస్టింగ్ టాలెంట్‌ను టెలివిజన్ ద్వారా కూడా చూపించారు. స్టార్ మా ఛానెల్లో ప్రసారమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1కు హోస్ట్‌గా వ్యవహరించిన తారక్, సీజన్‌ను సూపర్ హిట్‌గా మార్చారు.
ఆ తర్వాత “మీలో ఎవరు కోటీశ్వరుడు” షోకు కూడా హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నందున, బుల్లితెరకు కొంత గ్యాప్ తీసుకున్నారు. అందరికీ తెలియని విషయం ఏంటంటే… తారక్ తన కెరీర్ ప్రారంభంలో ఓ టీవీ సీరియల్లో కూడా నటించారు. ఈటీవీ ప్రారంభ దశలో ప్రసారమైన “భక్త మార్కండేయ” అనే సీరియల్లో తారక్ మార్కండేయుడి పాత్ర పోషించారు. ఈ పాత్రలో ఆయన చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్నారు. ఈ సీరియల్ కొద్ది రోజులే ప్రసారమైనా, ఎన్టీఆర్ లుక్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిన్ననాటి నుంచే కళల పట్ల ఆసక్తి చూపించిన తారక్, కూచిపూడి, భరతనాట్యంలు నేర్చుకున్నారు. 1997లో బాలరామాయణం సినిమాతో చిన్న రాముడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తాత ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణతో కలిసి బ్రహ్మర్షి విశ్వామిత్ర (హిందీ వెర్షన్) సినిమాలో నటించారు – అయితే ఆ చిత్రం విడుదల కాలేదు. 2000లో విడుదలైన నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా పరిచయమైన తారక్, తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తొలి హిట్ అందుకున్నారు. ఆ తరువాత ఆది, సింహాద్రి వంటి మాస్ హిట్లతో తారక్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అందిపుచ్చుకున్నాడు. వార్ 2 చిత్రంతో బాలీవుడ్ ఆరంగేట్రం కూడా చేశాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దీని తర్వాత తారక్ మళ్లీ దేవర 2 సెట్స్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది.