కొరటాల శివ (Siva Koratala), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) క్రేజీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30 (NTR 30). అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. కాగా ఇవాళ నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని నందమూరి అభిమానులకు మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.
ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రం షూటింగ్ 2023 ఫిబ్రవరిలో షురూ కానుంది. అదేవిధంగా 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని ప్రకటించారు మేకర్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా NTR 30 రాబోతుండగా.. ఈ చిత్రానికి పాపులర్ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ పనిచేస్తుండటం విశేషం.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కొరటాల-తారక్ కాంబోలో వస్తున్న రెండోది. జనతాగ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇక ఫీమేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఈ సినిమాలో కథానుగుణంగా వీఎఫ్ఎక్స్ టెక్నాలజీని వినియోగించబోతున్నారని ఇన్సైడ్ టాక్.
A man's fury is the cure for a disease called courage 🔥🔥#NTR30 in cinemas on April 5th, 2024 💥
Shoot begins next month 💥
Happy New Year ❤️@tarak9999 #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts pic.twitter.com/EleAsoa3JZ
— NTR Arts (@NTRArtsOfficial) January 1, 2023
ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్..
My next with Koratala Siva… https://t.co/iPyKSQ9Sjs pic.twitter.com/xaEB1ZbwON
— Jr NTR (@tarak9999) May 19, 2022