Joya Akhtar Next Movie | బాలీవుడ్ స్టార్స్ కిడ్స్ సుహానా ఖాన్, ఖుషీ కపూర్, అగస్త్య నంద పరిచయవుతూ తెరకెక్కనున్న చిత్రం ‘ది అర్చీస్’. ‘జిందగీ నా మిలేగీ దోబారా’, ‘తలాష్’, ‘గల్లీబాయ్’ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన జోయా అక్తర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. చిత్రంపై మొదటి నుంచే బాలీవుడ్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అమెరికన్ కామిక్ సిరీస్ అయిన ‘ది అర్చీస్ ఆధారంగా’ ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.
లవ్ యాక్షన్ మ్యూజికల్ ఫిలిమ్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం 1960 బ్యాక్‌గ్రౌండ్‌లో రూపొందనుంది. ఈ చిత్రంతో అభిషేక్ బచ్చన్ మనవడు అగస్త్య నందా, షారుఖ్‌ఖాన్ కూతురు సుహానా ఖాన్, బోనీ కపూర్ చిన్న కూతురు ఖుషీ కపూర్లు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ది అర్చీస్ కామిక్ పుస్తకంలోని ఆర్చీ ఆండ్రూస్, తన స్నేహితులు పాత్రలలో ఈ ముగ్గరు నటించనున్నారు. అలాంటి పాత్రల్లో ఈ ముగ్గరు స్టార్స్ కిడ్స్ నటించడంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని టైగర్ బేబి బ్యానర్‌పై జోయా అక్తర్, రీమా నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించినట్లు నిర్మాత రీమా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.