‘వారు ఇక్కడ లేరు కదా..’ అంటూ తాజాగా సీనియర్ నటుడు చిరంజీవి సరదాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు ప్రభు రచించిన ‘శూన్యం నుంచి శిఖారాగ్రాలకు’ పుస్తకాన్ని శుక్రవారం రాత్రి చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన మహిళలు ఆయనతో ఫోటోకోసం వచ్చినప్పుడు చిరంజీవి సరదాగా అలా వ్యాఖ్యానించడంతో అక్కడ ఉన్న అందరూ నవ్వుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవిపై గరికపాటి చేసిన కామెంట్లను గుర్తుచేసుకుంటూ చిరు ఈ ఛలోక్తి విసిరారని అందరూ అనుకుంటున్నారు.