టోడ్ ఫిలిప్స్ (Todd Phillips) దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన అమెరికన్ చిత్రం జోకర్ (Joker). డీసీ కామిక్స్ క్యారెక్టర్స్ ఆధారంగా తెరకెక్కిన జాక్విన్ ఫోనిక్స్ (Joaquin Phoenix) టైటిల్ రోల్లో నటించాడు. ఈ చిత్రంలో రాబర్ట్ డీ నైరో, జాజీ బీట్జ్, ఫ్రాన్సెస్ కాన్వాయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ భారీ బ్లాక్ బాస్టర్ ఆస్కార్స్ లో 11 కేటగిరీల్లో నామినేట్ కాగా.. జాక్విన్ ఫోనిక్స్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చాయి.
కాగా దీనికి సంబంధించిన వార్త ఒకటి ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. జోకర్ సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ విషయాన్ని Warner Bros. Pictures సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రానికి ‘Joker: Folie a Deux’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. సీక్వెల్ ఫస్ట్ పార్టు కంటే డిఫరెంట్‌గా డార్క్ అండ్ కన్ఫ్యూజన్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందట. హార్లే క్విన్ కో పార్ట్నర్గా పాప్ బ్యూటీ లేడీ గాగా కనిపించబోతున్నట్టు లేటెస్ట్ టాక్. సీక్వెల్ 2024 అక్టోబర్ 4న విడుదల కానుంది.
జోకర్ ఫస్ట్ పార్టు సరిగ్గా ఇదే రోజు అనగా 2019 అక్టోబర్ 4న విడుదలైంది. సరిగ్గా ఐదేళ్లకు జోకర్ సీక్వెల్‌తో అలరించేందుకు వస్తున్నాడన్నమాట. వరల్డ్ వైడ్‌గా గ్లోబల్ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించిన జోకర్ ..మరి సెకండ్ పార్టుతో ఏ రేంజ్లో బాక్సాపీస్ ను షేక్ చేస్తాడోనని ఎక్జయిటింగ్ ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
Joker: Folie à Deux October 4, 2024. Repost: Todd Phillips "Cheek to Cheek. 10.4.24" pic.twitter.com/eyZnHAAunZ
— Joker Movie (@jokermovie) August 4, 2022