Joker 2 Movie | హాలీవుడ్ సినిమాలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు జోకర్ (Joker). డీసీ కామిక్స్‌లో భాగంగా మూడేళ్ల కిందట వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇక ఈ సినిమాలో నటనకు గాను జోక్విన్ ఫీనిక్స్ (Joaquin Phoenix) ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు కూడా అందుకున్నాడు. అయితే బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘జోకర్: ఫోలీ ఏ డీక్స్’ (Joker: Folie à Deux) అంటూ ఈ సినిమా రానుండగా.. టాడ్ ఫిలిప్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉంది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ పోస్టర్లో జోక్విన్ ఫీనిక్స్‌తో పాటు పాప్‌స్టార్ లేడీగాగా నటించబోతుంది. జోకర్ వేషంలో ఉన్న జోక్విన్ గాగాతో డ్యాన్స్ చేస్తున్నట్లు పోస్టర్ ఉంది. అయితే ఈ చిత్రంలో జోకర్ గర్ల్ ఫ్రెండ్‌గా లేడీగాగా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం అక్టోబరు4, 2024న థియేటర్లలోకి రానుంది.