John Abraham | హాలీవుడ్ లెవల్లో జాన్ అబ్రహం సినిమా.. ఆకట్టుకుంటున్న ‘ఎటాక్’ ట్రైలర్
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం నటించిన లేటెస్ట్ మూవీ 'ఎటా'క్. లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది.
John Abraham Attack trailer | బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎటా’క్. లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మొదటి భాగం కరోనా కారణంతో విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే చిత్రం నుంచి విడులైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. తాజాగా సెకండ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం అసాధారణ పవర్స్ ఉన్న సూపర్ హీరోగా ఇండియన్ ఆర్మీగా నటిస్తున్నాడు.
తాజాగా విడుదలైన ట్రైలర్ హాలీవుడ్ రేంజ్లో విఎఫ్ఎక్స్ కనిపిస్తున్నాయి. హై యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో ఆధునిక టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ని ఉపయోగించుకుని యుద్ధాలు ఎలా జరుగుతాయి? వాటిని ఎదుర్కోడానికి ఎలా సిద్ధపడాలనే తరహా కాన్సెప్ట్‌తో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో అబ్రహంకు జోడిగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ సైంటిస్ట్‌గా నటించింది. ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

