Jio OTT Pass | రూ.200 లకే జియో కొత్త ‘ఓటీటీ పాస్’.. 15 ప్రీమియం యాప్‌లు, అన్లిమిటెడ్ 5G డేటా!
OTT News | రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 200 ధరతో సరికొత్త 'జియో ఓటీటీ పాస్' (Jio OTT Pass)ను ఈరోజు విడుదల చేసింది.
OTT News | రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 200 ధరతో సరికొత్త ‘జియో ఓటీటీ పాస్’ (Jio OTT Pass)ను ఈరోజు విడుదల చేసింది. ఒకే రీఛార్జ్‌తో మొబైల్ కనెక్టివిటీతో పాటు మెరుగైన వినోదాన్ని అందించే లక్ష్యంతో ఈ 28 రోజుల ప్యాక్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త ప్యాక్ ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ ద్వారా వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిని యాక్టివేట్ చేసుకోవాలంటే కస్టమర్ల మొబైల్లో ఏదైనా యాక్టివ్ బేస్ ప్లాన్ ఉండటం తప్పనిసరి.
ఈ సరికొత్త ప్యాక్ ద్వారా వినియోగదారులకు 15 ప్రీమియం ఓటీటీ యాప్‌ల సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఇందులో యూట్యూబ్ ప్రీమియం, జియోహాట్‌స్టార్ మొబైల్ + హాలీవుడ్ (లైవ్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ ఒరిజినల్స్, హాలీవుడ్ సినిమాలు), అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్లు ఉన్నాయి. వీటితో పాటు జియోటీవీ యాప్ ద్వారా యాక్సెస్ చేసుకోగలిగే సోనీలివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, ఫ్యాన్‌కోడ్, కాంచా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయిచోయ్, టైమ్స్ ప్లే, తరంగ్ ప్లస్ వంటి మరో 12 ఓటీటీల సబ్స్క్రిప్షన్ కూడా ఇందులో లభించబోతున్నాయి. ఇక ఈ వినోదంతో పాటు జియోటీవీ (JioTV) యాప్ ద్వారా కస్టమర్లు 1,000 కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను ఉచితంగా వీక్షించవచ్చు. ఇందులో 150 కి పైగా పెయిడ్ ఛానళ్లు కూడా ఉన్నాయి. ఇక డేటా ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 30 GB హై-స్పీడ్ 4G/5G డేటా లభించబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- 5GData
- jio
- JioOTTPass
- JioTV
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

