Jio Hotstar | సినిమా ప్రేక్షకులకు షాక్. ఓటీటీలో ఇన్నిరోజులు సెన్సార్ లేకుండా చూస్తున్న వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఇకపై భవిష్యత్‌లో చూడలేకపోవచ్చు. తాజాగా ఓటీటీ దిగ్గజాలు హాట్‌స్టార్, జియో సినిమా కలిసిపోయి జియోహట్స్టార్గా మారిన విషయం తెలిసిందే. అయితే జియో హట్‌స్టార్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వచ్చే ఇంటర్నేషనల్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు ఇండియా నుంచి వచ్చే చిత్రాలకు సెన్సార్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇండియన్ ఆడియన్స్‌కి అనుగుణంగా భవిష్యత్‌లో వచ్చే అన్ని చిత్రాలకు సెన్సార్ షిప్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే జియోలో వచ్చే హెబీవో కంటెంట్‌తో పాటు పీకాక్. హూలుకి సంబంధించిన కంటెంట్ మొత్తం సెన్సార్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు హెబీవో కంటెంట్ జియోలో ఉచితంగా యాక్సెస్ ఉండగా.. ఇప్పుడు అసలు హెబీవోలో ఉండే వెబ్ సిరీస్‌లు కనిపించట్లేవని ఓటీటీ ప్రేక్షకులు ఫిర్యాదులు చేస్తున్నారు. రీసెంట్గా హెబీవోలో వచ్చిన ది వైట్ లోటస్ సీజన్ 3 (The White Lotus) వెబ్ సిరీస్‌ని జియోలో సెన్సార్ చేశారు. దీంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున్న సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సెన్సార్షిప్ పేరుతో ప్రేక్షకుల చూసే కంటెంట్‌పై పరిమితులు పెడుతున్నాట్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు సెన్సార్ లేకుండా ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలు చూద్దాం అనుకున్న ప్రేక్షకులకు కూడా ఇకపై నిరాశనే ఎదురవ్వనుంది.