Thug Life | లోకనాయకుడు కమల్‌హాసన్ (Kamal Haasan) హీరోగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. ‘నాయగన్’ (నాయకుడు 1987) తర్వాత దాదాపు 37 ఏండ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. జూన్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి పాపులర్ అయిన జింగుచా వీడియో సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.