Jigris Movie Top Trending | చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం ‘జిగ్రీస్’ (Jigrees). థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ వేదికలైన అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మరియు సన్ నెక్స్ట్ (SunNXT) లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ లేదా యూత్ సినిమాలంటే వల్గారిటీ, బూతులు ఉంటాయనే భ్రమను ‘జిగ్రీస్’ పటాపంచలు చేసింది. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల తన మొదటి సినిమానే ఎంతో పరిణితితో, ఎక్కడా అసభ్యత లేకుండా కుటుంబం అంతా కలిసి చూసేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. నలుగురు మిత్రుల ప్రయాణం, వారి మధ్య ఉండే ఎమోషన్స్ మరియు అన్-లిమిటెడ్ కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలం.
కృష్ణ బురుగుల కామెడీ టైమింగ్ అదిరింది!
ఈ చిత్రంలో కృష్ణ బురుగుల తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తూ మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయనతో పాటు మణి వక్కా, ధీరజ్ ఆత్రేయ, రామ్ నితిన్ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. ప్రతి పాత్ర ప్రేక్షకుల మనసు గెలుచుకోవడంలో సక్సెస్ అయ్యింది.
సందీప్ రెడ్డి వంగా అండ.. టెక్నికల్ ఎక్సలెన్స్!
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి అందించిన మద్దతు సినిమాపై హైప్‌ను పెంచింది. సాంకేతికంగా చూస్తే: సయ్యద్ కమ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేసింది. చాణక్య రెడ్డి తూరుపు షార్ప్ ఎడిటింగ్, ఈశ్వరదిత్య విజువల్స్ సినిమాను రిచ్‌గా చూపించాయి. నిర్మాత కృష్ణ వోడపల్లి, సహ నిర్మాత చిత్తం వినయ్ కుమార్ ఎక్కడా రాజీ పడకుండా ఈ క్వాలిటీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు.
సోషల్ మీడియాలో ‘జిగ్రీస్’ వైరల్
ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమా క్లిప్పింగ్స్ మిలియన్ల వ్యూస్‌తో ట్రెండ్ అవుతున్నాయి. “ఇది కదా అసలైన ఫ్రెండ్షిప్ మూవీ” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ వీకెండ్లో ఈ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ను మిస్ అవ్వకుండా అమెజాన్ ప్రైమ్‌లో చూసేయండి!