Jigra Movie Teaser Trailer | రాఖీ కట్టి తన అక్కకు ఏ కష్టం వచ్చిన చూసుకుంటాను అంటారు సోదరులు. కానీ ఇక్కడ తన తమ్ముడికి కష్టం వస్తే.. అతనికి ఎలాంటి హానీ జరగకుండా కాపాడుకుంటానని అలియా భట్ ఒక అక్కగా ప్రమాణం చేస్తుంది. రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Kii Prem Kahaani) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అలియా భట్ నటిస్తున్న తాజా చిత్రం ‘జిగ్రా’(JIGRA). ‘ఆర్చీస్’ చిత్రంలో కీలక పాత్ర పోషించినవేదాంగ్ రైనా అలియా భట్ తమ్ముడిగా నటిస్తుండగా.. టాలీవుడ్ నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఈ సినిమాకు మౌనిక ఓ మై డార్లింగ్ సినిమా ఫేం వసన్ బాల దర్శకత్వం వహిస్తుండగా.. ధర్మ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్ & సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ చూస్తే.. ఆపదలో ఉన్నతమ్ముడిని రక్షించుకోవడానికి ఒక అక్క చేసే పోరాటమే ఈ సినిమా అని తెలుస్తుంది. ఇక అలియా భట్ చాలా రోజుల తర్వాత కొత్త లుక్‌లో కనిపించింది.