Jigarthanda Double X | కోలీవుడ్ స్టార్ హీరోలు రాఘవా లారెన్స్ (Raghava Lawrence), ఎస్జే సూర్య (SJ Surya) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda Double X). 2014లో యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రిలీజై తమిళంలో
సూపర్ హిట్‌గా నిలిచిన జిగర్తండ చిత్రానికి డబుల్ ఎక్స్ సీక్వెల్‌గా వస్తోంది. (ఇదే సినిమాను తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ అంటూ రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు.) గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (karthik subbaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో పాటు జిగర్తాండ 2 టీజర్, ట్రైలర్లకు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నవంబర్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ఈ సినిమాను తెలుగులో గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేశారు.
ఇప్పటికే చెన్నైలో ఈ సినిమా తమిళ వెర్షన్‌కు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక జరుగగా.. ఈ వేడుకకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో తెలుగులోనూ అదే స్థాయిలో ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. దానికోసం ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ నానకరాంగూడలోని ప్రధాన్ కన్వెన్షన్స్ హాల్‌ను ఎంచుకున్నారు. నవంబర్ 04 తేదిన సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
It’s time for some scintillating action with Victory @VenkyMama X #JigarthandaDoubleX 💥💥
Grand Pre-Release Event On November 4th with Victory Venkatesh garu gracing the event 🔥🔥
📍Pradhan Conventions, Hyderabad from 6 PM onwards!
Worldwide release on November 10th.… pic.twitter.com/JHjfdTQuPC
— Vamsi Kaka (@vamsikaka) November 3, 2023
జిగర్ తండ డబుల్ ఎక్స్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ప్రొడక్షన్స్ హౌజ్ సురేశ్ ప్రొడక్షన్స్‌తోపాటు ఏసియన్ సినిమాస్ విడుదల చేయనున్నాయి. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన జిగర్ తండ డబుల్ ఎక్స్ టీజర్‌తో పాటు ట్రైలర్లకు అద్బుతమైన రెస్పాన్ వస్తోంది. సినిమా పక్కా మాస్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో వినోదాత్మకంగా సాగనుందని టీజర్‌తో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.