Jigarthanda Double X | కోలీవుడ్ స్టార్ హీరోలు రాఘవా లారెన్స్ (Raghava Lawrence), ఎస్జే సూర్య (SJ Surya) లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda Double X). 2014లో యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రిలీజై తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన జిగర్తండ (Jigarthanda) చిత్రానికి డబుల్ ఎక్స్ సీక్వెల్‌గా వస్తోంది. (ఇదే సినిమాను తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ (Gaddalakonda ganesh) అంటూ రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు) ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (karthik subbaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 10న గ్రాండ్‌గా విడుదలై మంచి విజయం అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 08 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక మొదటి పార్ట్ లాగానే జిగర్తాండ డబుల్ ఎక్స్ కూడా రౌడీకి, దర్శకుడికి మధ్య జరిగే సంఘర్షణ చుట్టూనే తిరుగుతుంది. అలాగే ఈ సినిమా కథ 1975 నాటి రెట్రో స్టైల్లో సాగుతుంది. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు.
Karthik Subbaraj’s #JigarthandaDoubleX digital arrives December 8 on Netflix.
Starring – Sj Suryah, Raghava Lawrence, Nimisha Vijayan & Shine Tom Chacko.#JigarthandaDoubleXOnNetflix pic.twitter.com/WexcgyfDn3
— Ott Updates (@Ott_updates) December 1, 2023