లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్’ అదే పేరుతో ఇటీవల తెలుగులో విడుదలైంది. ఆర్కే ఫిలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణగౌడ్ రిలీజ్ చేశారు. సినిమాను 45 థియేటర్లలో విడుదల చేశామని, అన్ని కేంద్రాల్లో మంచి స్పందన లభిస్తున్నదని, మహిళా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని, ఈ సినిమా విషయంలో అంచనాలు నిజమయ్యాయని ప్రతాని రామకృష్ణగౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర, సీడెడ్లలో ఈ నెల రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.