Jennifer Lopez | ప్రముఖ పాప్ సింగర్, హాలీవుడ్ నటి గాయపడ్డారు. ప్రతిష్టాత్మక అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ కార్యక్రమం సందర్భంగా రిహార్సల్స్ చేస్తున్న సమయంలో స్వల్ప గాయమైంది. దాంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం తాను కోలుకున్నానని.. మే 26న జరిగే కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించేందుకు సిద్ధమేనని వెల్లడించారు. జెన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ముక్కుకైన గాయాన్ని చూపిస్తూ.. ఐస్‌తో కాపడం పెడుతున్న ఫొటోను షేర్ చేసింది.
మ్యూజిక్ అవార్డ్ రిహార్సల్స్‌లో ప్రమాదం జరిగిందని పేర్కొంది. వారం రోజుల్లోనే గాయం నుంచి కోలుకున్నానని తెలిపింది. ఐస్ వాడకంతో తాను మళ్లీ మామూలు స్థితికి వచ్చానని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా.. మే 26న లాస్ వెగాస్‌లోని బ్లూలైవ్ థియేటర్లో అమెరికన్ అవార్డుల ప్రదానోత్సవం జరుగనున్నది. దాదాపు జెన్నిఫర్ లోపెజ్ పదేళ్ల విరామం హోస్ట్‌గా చేయనుండడం విశేషం. 2015 తర్వాత తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నది. ఏప్రిల్ 9న డిక్ క్లార్క్ ప్రొడక్షన్స్ సీఈఓ ఈ విషయాన్ని ప్రకటించారు.
Jennifer Lopez