Kalki 2 | ప్రభాస్ (Prabhas) లీడ్ రోల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ జోనర్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్ కల్కి 2 కూడా రాబోతుందని తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సీక్వెల్‌పై ఆసక్తికర వార్త ఒకటి అభిమానులు, మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది.
టాలీవుడ్ యాక్టర్ జేడీ చక్రవర్తి కల్కి 2 టీంతో జాయిన్ అయ్యాడట. తాజా టాక్ ప్రకారం జేడీ చక్రవర్తి హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్లో దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్ కలిసి జాయిన్ అయ్యాడని ఇన్సైడ్ టాక్. కాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ జేడీ చక్రవర్తికి ఎలాంటి రోల్ ఇచ్చాడు.. దీనిపై నాగ్ అశ్విన్ టీం నుంచి ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో చూడాలి మరి. కల్కి 2లో దీపికా పదుకొనే ప్లేస్‌లో మరో నటిని తీసుకోనుండగా.. అది ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది.
వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా 2024 జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కల్కి 2898 ఏడీలో బాలీవుడ్ భామ దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.ఫస్ట్ పార్టులో కనిపించిన అన్ని పాత్రలు సీక్వెల్లో ఉంటాయా..? అన్నది తెలియాల్సి ఉంది.
Bandlaguda | ఔటర్ రింగ్ రోడ్ పై లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
Dhurandhar 2 Blunder | ‘ధురంధర్ 2’ యాక్షన్ సీన్లో కెమెరామెన్ ప్రత్యక్షం.. నెటిజన్ల ట్రోలింగ్.!