Siren Movie | పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, 2 చిత్రాలతో ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తమిళ నటుడు జయం రవి (Jayam Ravi). ఇక ఈ విజయాలతో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తని ఒరువన్ 2, ఇరైవన్ సినిమాలు చేస్తున్న జయం రవి.. తాజాగా మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం సైరన్ (Siren). కీర్తి సురేష్ (Keerthy Suresh) కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సైరన్ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో అప్డేట్ను ప్రకటించారు.
జయం రవి బర్త్ డే సందర్భంగా.. సైరన్ ప్రీఫేస్ (Siren Preface) అనే ప్రోమోను సెప్టెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అన్నాత్తే, విశ్వాసం, హీరో సినిమాలకు రచయితగా చేసిన ఆంటోనీ భాగ్యరాజ్(Antony Baghyaraj) ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో జయం రవి ఖైదీ (Prisoner)గా కనుపించనుండగా.. కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనుంది.
An interesting PreFace on the occasion of @actor_jayamravi’s birthday from #Siren team will be OUT at Sep 10 12:00 AM.
Stay tuned for an exciting visual 🔥#SirenPreface#HBDJayamRavi@antonybhagyaraj @KeerthyOfficial @anupamahere @theHMMofficial @sujataa_HMM @gvprakash… pic.twitter.com/neNMv8JxJV
— Home Movie Makers (@theHMMofficial) September 8, 2023
యాక్షన్-ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామాగా రానున్న ఈ సినిమాను హోమ్ మూవీ మేకర్స్ బ్యానర్ (Home Movie Makers)పై.. సుజాత విజయ్‌కుమార్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran), యోగిబాబు (Yogi babu), సముద్రఖని (Samudrakhani) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా జీవి ప్రకాష్ (Gv prakash) సంగీతం అందిస్తున్నాడు.