సాయి వెంకట్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. సాయి ప్రసన్న, ప్రవళిక నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అతిథులుగా హాజరయ్యారు.
సాయి వెంకట్ మాట్లాడుతూ…‘రెండు భాగాల ఈ చిత్రాన్ని ఏడాదిలో పూర్తి చేశాను. రామానుజ కథను ప్రేక్షకులకు నచ్చేలా చూపిస్తున్నాం. నా కూతురు నాలుగు పాత్రల్లో నటించింది. సుమన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఫిబ్రవరిలో తొలిభాగం సినిమాను విడుదల చేస్తాం’ అన్నారు. ట్రైలర్ బాగుందని, చిత్రబృందం ప్రయత్నం విజయవంతం కావాలని ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం అన్నారు.