‘అరిషడ్వర్గాల గురించి ఎంతో మంది గొప్పవాళ్లు చెప్పారు కానీ.. వాటిని జయించడానికి పరిష్కారాలను చూపించలేదు. మా సినిమాలో ఆ ప్రయత్నం చేశాం. ఈ సినిమా కథతో త్వరలో ఓ పుస్తకాన్ని తీసుకొస్తున్నాం. ఈ చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి ఆదరణ దక్కుతున్నది’ అని చెప్పారు దర్శకుడు జయశంకర్. ఆయన నిర్ధేశకత్వంలో రూపొందిన ‘అరి’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
వినోద్‌వర్మ, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించారు. మంగళవారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు జయశంకర్..ఈ సినిమా ఇప్పుడే ఓటీటీలోకి రావడం లేదని, థియేట్రికల్ రన్ పూర్తయ్యాకే ఓటీటీ డేట్ ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.