Jawan Movie Trailer | సరిగ్గా వారం రోజుల్లో విడుదల కాబోతున్న జవాన్‌పై జనాల్లో మాములు అంచనాల్లేవు. హిందీతో సహా తమిళ, తెలుగు ప్రేక్షకులు కూడా వీర లెవల్లో అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్లే పోస్టర్లు, గ్లింప్స్ గట్రా సినిమాపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేశాయి. అప్పుడే బాలీవుడ్ ట్రేడ్ షారుఖ్‌కు ఈ సినిమా మరో వెయ్యి కోట్ల బొమ్మవుతుందని అంచనా కూడా వేసేశారు. సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ల వేట కొనసాగిస్తుంది. నిన్న చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. త్వరలో తెలుగులోనూ భారీ స్థాయిలో ప్రెస్మీట్లు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్లను రిలీజ్ చేశారు. ఒక్క మాటలో ట్రైలర్ గురించి చెప్పాలంటే గూస్బంప్స్ అంతే. అట్లీ యాక్షన్ మార్క్ ట్రైలర్లో పుష్కలంగా కనిపిస్తుంది. వరుసగా యుద్దాలు ఓడిపోయి కోపంతో ఉన్న ఒక రాజు ఆకలితో అడవిలో తిరుగుతున్నాడంటూ హీరో క్యారెక్టర్ థీమ్‌ను చెప్తూ ట్రైలర్‌ను స్టార్ట్ చేశారు. ఆ వెంటనే మెట్రో ట్రైన్‌ను హై జాక్ చేసిన వాడిలా షారుఖ్‌ను చూపించారు. అసలు షారుఖ్ ట్రైన్‌ను హైజాక్ చేయడానికి కారణం ఏంటీ? దానికి వెనుక డిమాండ్స్ ఏంటీ అనేది తెలుసుకోవాలంటే సినిమా వచ్చే వరకు ఆగాలి. ఇక విజయ్ రోల్ ఈ సినిమాలో వేరే లెవల్ ఉండబోతుందని తెలుస్తుంది. నెరిసిన గడ్డం, జుట్టుతో తన సమ్రాజ్యంపై ఎవరైనా చేయ్యేస్తే పులి నోటికి చిక్కినట్లే అన్న రేంజ్లో విజయ్ సేతుపతి ఎవిల్నెస్ను చూపించారు.
ఈ సినిమాలో షారుఖ్ డ్యూయల్ రోల్లో తండ్రి, కొడుకులుగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ట్రైలర్ వేరే లెవల్లో ఉంది. ఆరంభం నుంచి ముగింపు వరకు ఒకటే యాక్షన్. బీ, సీ సెంటర్లలో ఎలాంటి మాస్ బొమ్మలు పడితే థియేటర్లు దద్దరిల్లుతాయో జవాన్ అచ్చం అలానే అనిపిస్తుంది. నయనతార కూడా యాక్షన్ మోడ్‌లో దుమ్మరేపింది. గెస్ట్ రోల్లో దీపికా పదుకునే బీస్ట్ అవతారంలో కనిపించింది. ముఖ్యంగా ట్రైలర్లో అనురుధ్ రవిచంద్రన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉంది. షారుఖ్ ఫ్యాన్స్ తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు. బొమ్మ మాత్రం బ్లాక్‌బస్టర్ అని ట్రైలర్‌తో స్పష్టం అయిపోయింది.
ఒక అధ్బతం మీకోసం ఎదురు చూస్తుంది మీరు సిద్ధమా…!!??🔥#JawanTrailer ఇప్పుడు విడుదల అయ్యింది!
Kaaryakramamu meekosam nireekshistundi! Meeru siddhama?🔥#JawanTrailer ippudu release ayyindi! #Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/W9WWXyQ4ph
— Red Chillies Entertainment (@RedChilliesEnt) August 31, 2023
ఇప్పటికే ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు రూ.250 కోట్ల రేంజ్లో బిజినెస్ చేశాయి. పైగా పఠాన్ వంటి ఇండస్ట్రీహిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో జవాన్‌పై అందరిలోనూ వీరలెవల్లో అంచనాలున్నాయి. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుంది. షారుఖ్‌కు జోడీగా నయనతార నటిస్తుంది. హిందీతో పాటు పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. అనురుధ్ రవిచంద్రన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు.