Jawan Movie | అట్లీ (Atlee) దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’ (Jawan). ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.695 కోట్లు కొల్లగొట్టింది. ఈ వారం నార్త్‌లో చెప్పుకోదగ్గ రేంజ్లో సినిమాలేవి రిలీజ్ కాకపోవడం బాగా కలిసొచ్చింది. ఇదే జోరు కొనసాగితే వచ్చే వారంలోపు వెయ్యి కోట్ల మార్క్ అందుకునే చాన్స్ ఉంది. అదే జరిగితే తొలిసారి రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఉన్న తొలి ఇండియన్ హీరోగా షారుఖ్ చరిత్ర సృష్టించిన వాడవుతాడు. ఇదిలా ఉండగా శుక్రవారం ముంబయిలో ‘జవాన్’ సక్సెస్ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి.
ఈ ఈవెంట్లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తన లైవ్ పర్ఫార్మెన్స్తో మరోసారి అదరగొట్టారు. ‘జవాన్’ సక్సెస్ ఈవెంట్లో భాగంగా ‘చలేయా’ పాట పాడిన అనిరుధ్ షారూఖ్ ఖాన్, దీపికలను చేయి పట్టుకొని స్టేజీపైకి తీసుకెళ్లారు. అనంతరం ‘చలేయా’ పాటకు అనిరుధ్‌తో కలిసి షారూఖ్ ఖాన్, దీపిక స్టెప్లు వేశారు. దీంతో ప్రేక్షకుల కేకలు, విజిళ్లతో ఈవెంట్ దద్దరిల్లిపోయింది. షారూఖ్ డ్యాన్స్ చేయటంతో ఆడియన్స్ థ్రిల్ అయ్యారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Shah Rukh Khan & Deepika Padukone dancing on #Chaleya with Anirudh ❤️
SRK DP look so good together 💥#JawanCreatesHistory #JawanEvent pic.twitter.com/7MY7C7Op54
— Syed Irfan Ahmad (@Iam_SyedIrfan) September 15, 2023