Jawan Movie | ప్రస్తుతం నార్త్ నుంచి సౌత్ వరకు జవాన్ ప్రవాహంలో కొట్టకుపోతున్నారు సినీ లవర్స్. షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయం తమాషాను చూడడానికి జనాలు తండోప తండాలకు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. షారుఖ్ కెరీర్లో అతి పెద్ద హిట్టు అంటే పఠాన్. ఇప్పుడా అతి పెద్ద హిట్టును కూడా సింపుల్‌గా దాటేలా కనిపిస్తుంది. తొలిరోజే అనుకంటే వరుసగా నాలుగు రోజులు వందల కోట్లు కొల్లగొడుతూ ఊచకోతకు డెఫినేషన్ చూపించింది. కేవలం సినీ లవర్స్ అనే కాదు సినీ సెలబ్రెటీలు సైతం జవాన్ కోసం థియేటర్లకు కదిలి వస్తున్నారు. ఇక జైలర్ తర్వాత ఆ స్థాయిలో తెలుగులో ఓ డబ్బింగ్ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక్కముక్కలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.
కాగా సోమవారం నుంచి కాస్త డల్ అయింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా ఆరోందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అన్ని భాషల ఓటీటీ హక్కులు కలిపి రూ.250 కోట్ల ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదన్నది ఇన్సైడ్ టాక్. కేవలం ఓటీటీ హక్కుల కోసమే ఇంత పెద్ద మొత్తం ఆఫర్ చేయడమనేది జరగని పని అంటున్నారు. నిజానికీ ఇది చాలా పెద్ద నెంబర్. జవాన్ సినిమా బడ్జెట్ కూడా అంత కాలేదు. ఈ లెక్కన అంత ఆఫర్ చేయడంలో అర్థమే లేదని సౌత్ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం సౌత్ సినిమాల డామినేషన్‌తో బాలీవుడ్ వాళ్లు ఇలా అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో షారుఖ్ తండ్రి, కొడుకులా ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా షారుఖ్‌కు ఇచ్చిన ఎలివేషన్లకు నార్త్ ఆడియెన్స్ ఊగిపోతున్నారు. పలువురు బాలీవుడ్ దర్శకుల పేర్లు ప్రస్తావిస్తూ సినిమాలంటే ఇలా తీయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. దీపికా గెస్ట్ అప్పియెరెన్స్ కనిపించింది. విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చాడు.