Jawan Movie Non-Theatrical Rights | హిందీ నటులలో దక్షిణాది ప్రేక్షకులు అమితంగా అభిమానించేది షారుఖ్ ఖాన్నే. ఆయన సినిమా రిలీజవుతుందంటే ఇక్కడ కూడా పెద్ద పెద్ద బ్యానర్లు, ఈలలు, గోలలతో థియేటర్లు మార్మోగిపోతుంటాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో షారుఖ్ సినిమా రిలీజవుతుందంటే టాలీవుడ్ స్టార్ హీరో సినిమా రేంజ్లో సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన అట్లీతో జవాన్ చేస్తుండటంతో ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలున్నాయి. ఈ సినిమా కేవలం సౌత్‌లోనే షారుఖ్‌కు రెండొందల కోట్ల బొమ్మ అవుతుందనడంలో ఆశ్చర్యమే లేదు.
ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ గట్రా సినిమాపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేశాయి. అప్పుడే బాలీవుడ్ ట్రేడ్ షారుఖ్‌కు ఈ సినిమా మరో వెయ్యి కోట్ల బొమ్మవుతుందని అంచనా కూడా వేసేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరో ఐదారు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఓ రేంజ్లో బిజినెస్ జరుగుతుందట. కేవలం నాన్-థియేట్రికల్ హక్కులకే రూ.250 కోట్ల రేంజ్లో బిజినెస్ జరిగిందట. ట్రైలర్ కూడా రిలీజ్ అవక ముందే ఈ రేంజ్లో బిజినెస్ జరుగుతుందంటే షారుఖ్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
పఠాన్ వంటి ఇండస్ట్రీహిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో జవాన్‌పై అందరిలోనూ వీరలెవల్లో అంచనాలున్నాయి. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుంది. షారుఖ్‌కు జోడీగా నయనతార నటిస్తుంది. హిందీతో పాటు పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. అనురుధ్ రవిచంద్రన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు.