Shah Rukh Khan | విడుదలకింకా రెండు వారాలు కూడా లేని జవాన్ సినిమాపై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ల పనిలో పడిపోయింది. హిందీ సహా తమిళ, తెలుగు భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. అప్పుడెప్పుడో రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుంచి రీసెంట్గా రిలీజైన సెకండ్ సింగిల్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుతూ వస్తున్నాయి. ఇక త్వరలోనే చెన్నైలో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత తెలుగు, హిందీలో ప్రెస్ మీట్లు నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా మేయిన్ ప్లాట్ గురించి షారుఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహిళ ప్రధాన్యమైన సినిమాగా జవాన్ తెరకెక్కిందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని జవాన్ తెలిపాడు. పోస్టర్లు, ట్రైలర్లు గట్రా చూసి ఈ సినిమా స్పై అని, గ్యాంగ్‌స్టార్ సినిమా అని, మాఫీయా బ్యాక్‌డ్రాప్ సినిమా అని ఇలా పలు రకాల జానర్లో సినిమా తెరకెక్కుతున్నట్లు అనిపించింది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా మహిళా ప్రధాన్యమైన కోర్ పాయింట్‌తో వస్తుందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా సాంబర్ బ్యాచ్‌లో షారఖ్ చేసిన కామెంట్స్‌పై కాస్త టెన్షన్ నెలకొంది.
ఎందుకంటే అట్లీ చివరి సినిమా బిగిల్ కూడా మహిళా ప్రధాన్యంగా సాగుతుంది. మెర్సల్ వంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఓ రేంజ్లో బిగిల్‌పై తమిళ తంబీలు అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఊహించిన విధంగా బిగిల్ సినిమా మహిళా కాన్సెప్ట్‌తో తెరకెక్కడంతో చాలా మంది షాక్ అయ్యారు. టీజర్, ట్రైలర్లు గట్రా చూసి ఇది పక్కా మాస్ సినిమా అని, గ్యాంగ్‌స్టర్ సినిమా అని చూపించారు. తీరా థియేటర్లకు వచ్చే సరికి ఎక్స్ట్పెక్ట్ చేయని స్టోరీ ఉండటంతో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. దాంతో కమర్షియల్‌గా యావరేజ్ సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు జవాన్ సైతం అలాగే ఉండటం కొంత మంది ఫ్యాన్స్‌ను నిరాశ పడుతున్నారు.