Jawan Movie First Single | నెలరోజులకు పైగా రిలీజ్‌కు టైమ్ ఉన్న జవాన్ సినిమా ఇప్పటి నుంచే ప్రమోషన్ క్యాంపెయిన్ మొదలు పెట్టిసేంది. ప్రమోషన్లో భాగంగా రిలీజైన టీజర్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. షారుఖ్‌ను ఒకేసారి అన్ని గెటప్స్‌లో చూసి హిందీ ప్రేక్షకులు అబ్బురపడి పోయారు. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పైగ పఠాన్ వంటి అరి వీర భయంకర హిట్ తర్వాత ఈ సినిమా వస్తుండంటంతో అందరిలోనూ అమితాసక్తి ఏర్పడింది. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై తిరుగులేని హైప్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దుమ్మే దులిపేలా అంటూ సాగిన ఈ పెప్పీ నెంబర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. అనిరుధ్ రవిచంద్రన్ స్వర పరిచిన ఈ పాటను స్వయంగా ఆయనే ఆలపించాడు. చంద్రబోస్ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. ఇక ఈ పాట కోసం ఏకంగా రూ.15 కోట్లు ఖర్చుపెట్టినట్లు , బాంబే నుంచి వెయ్యి మంది డాన్సర్లను రప్పించారని వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను ఊపేసింది. అయితే విజువల్ పరంగా మాత్రం ఆ పాట హై స్టాండడ్స్లో ఉంది. ముఖ్యంగా శోభి పౌల్రాజ్ కొరియెగ్రఫి చాలా స్టైలిష్‌గా ఉంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులన్ని కలుపుకుని భారీ స్థాయిలో బిజినెస్ జరిగిదని, విడుదలకు ముందే సినిమాకు మూడొందల కోట్లు లాభాలు వచ్చాయని బాలీవుడ్ మీడియా టాక్. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది.