Jawan Movie | ప్రస్తుతం నార్త్ నుంచి సౌత్ వరకు జవాన్ ప్రవాహంలో కొట్టకుపోతున్నారు సినీ లవర్స్. షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయం తమాషాను చూడడానికి జనాలు తండోప తండాలకు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. షారుఖ్ కెరీర్లో అతి పెద్ద హిట్టు అంటే పఠాన్. ఇప్పుడా అతి పెద్ద హిట్టును కూడా సింపుల్‌గా దాటేలా కనిపిస్తుంది. తొలిరోజే అనుకంటే వరుసగా నాలుగు రోజులు వందల కోట్లు కొల్లగొడుతూ ఊచకోతకు డెఫినేషన్ చూపిస్తుంది. కేవలం సినీ లవర్స్ అనే కాదు సినీ సెలబ్రెటీలు సైతం జవాన్ కోసం థియేటర్లకు కదిలి వస్తున్నారు. ఇక జైలర్ తర్వాత ఆ స్థాయిలో తెలుగులో ఓ డబ్బింగ్ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక్కముక్కలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.
శని, ఆదివారాలైతే టిక్కెట్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డు కొల్లగొట్టింది. కేవలం 4రోజుల్లోనే 500 క్లబ్‌లోకి అడుగపెట్టి బాలీవుడ్ సినీ చరిత్రలో ఓ అరుదైన రికార్డులను కొల్లగొట్టింది. ఇంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి బాలీవుడ్ సినిమాగా చరిత్ర సృష్టించింది. నాలుగు రోజుల్లో రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిందంటే మాములు విషయం కాదు. షారుఖ్‌ఖాన్‌కు ఈ ఏడాది మరో వెయ్యి కోట్ల సినిమా కావడం పక్కా అని క్లారిటి వచ్చేసింది. ఇక సోమవారం కూడా ఈ సినిమా బుకింగ్స్ ఓ రేంజ్లో ఉన్నాయి.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో షారుఖ్ తండ్రి, కొడుకులా ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా షారుఖ్‌కు ఇచ్చిన ఎలివేషన్లకు నార్త్ ఆడియెన్స్ ఊగిపోతున్నారు. పలువురు బాలీవుడ్ దర్శకుల పేర్లు ప్రస్తావిస్తూ సినిమాలంటే ఇలా తీయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. దీపికా గెస్ట్ అప్పియెరెన్స్ కనిపించింది. విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చాడు.
Jawan WW Box Office
The film joins the elite ₹500 cr club in just 4 days across the world.
Registers biggest single day collection in India for any Bollywood film till date.
||#Jawan|#ShahRukhKhan|#Nayanthara||
Day 1 – ₹ 125.05 cr
Day 2 – ₹ 109.24 cr
Day 3 – ₹ 140.17… pic.twitter.com/5GLg3Az7Qa— Manobala Vijayabalan (@ManobalaV) September 11, 2023