Shah Rukh Khan | గతేడాది బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం జవాన్ (Jawan). తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. రూ.1150 కోట్లకు పైగా వసూళ్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం అరుదైన రికార్డును అందుకుంది.
గతేడాది Googleలో నెటిజన్లు అత్యధికంగా వెతికిన టాప్ 10 సినిమాలలో షారుఖ్ ఖాన్ జవాన్ 3వ స్థానం సంపాదించుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు అట్లీ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. ఇక షారుఖ్ నటించిన పఠాన్ చిత్రం కూడా టాప్ 10లో 10వ స్థానం దక్కించుకుంది.
ఇక 2023 Googleలో నెటిజన్లు అత్యధికంగా వెతికిన టాప్ 10 సినిమాలు చూసుకుంటే..
1.బార్బీ
2.ఓపెన్‌హైమర్
3.జవాన్
4.సౌండ్ ఆఫ్ ఫ్రీడం
5.జాన్ విక్: చాప్టర్ 4
6.అవతార్: ది వే ఆఫ్ వాటర్
7.‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ (Everything Everywhere All At Once)
8.గదర్ 2
9.క్రీడ్ III
10.పఠాన్
Top 10 most searched movies on Google in 2023:
1.🇺🇸 Barbie
2.🇺🇸 Oppenheimer
3.🇮🇳 Jawan
4.🇺🇸 Sound of Freedom
5.🇺🇸 John Wick: Chapter 4
6.🇺🇸 Avatar: The Way of Water
7.🇺🇸 Everything Everywhere All at Once
8.🇮🇳 Gadar 2
9.🇺🇸 Creed III
10.🇮🇳 PathaanAccording to Google Trends
— World of Statistics (@stats_feed) June 5, 2024
❤️❤️❤️ https://t.co/NUiGjSORLJ
— atlee (@Atlee_dir) June 6, 2024