Shah Rukh Khan | ప్రస్తుతం హిందీ ప్రేక్షకులు జవాన్ కోసం కాచుకుని ఉన్నారు. రెండు వారాల ముందు రిలీజైన జవాన్ ట్రైలర్ పిచ్చ పిచ్చగా ఎక్కేసింది. షారుఖ్ ఫ్యాన్స్ అయితే పొరపాటున ఎక్కడైన అట్లీ కనిపిస్తే పూజలు, పురస్కారాలు చేసేలా ఉన్నారు. అంతలా ట్రైలర్ నచ్చేసింది. పఠాన్‌కు మించి ఉండబోతుందని ఇప్పటి నుంచి పలువురు ఎనాలసిస్లు చేసేస్తున్నాడు. ఇక బాలీవుడ్ ట్రేడ్ అయితే పక్కా ఇది షారుఖ్‌కు మరో వెయ్యి కోట్ల బొమ్మ అని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. నిజానికి పఠాన్‌లో అంత మ్యాటర్ లేకపోయినా.. ఒక్క షారుఖ్ క్రేజ్‌తోనే సినిమా కోట్లు కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు ఆ క్రేజ్‌కు అట్లీ అదిరిపోయే కథను వండి విందుకు రెడీ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. కాగా ఇప్పటికే ఈ సినిమాకు మూడొందల కోట్ల ప్రాఫిట్స్ వచ్చినట్లు ఇన్సైడ్ టాక్. థియేట్రికల్ రైట్స్ అన్ని ఏరియాలు కలుపుకుని రూ.312 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందట. ఇక నాన్-థియేట్రికల్ హక్కులకు సుమారు రూ.250 కోట్లకు డీల్ కుదిరిందని తెలుస్తుంది. అందులో డిజిటల్ హక్కులు అన్ని లాంగ్వేజెస్‌కు కలిపి రూ.130 కోట్లు, శాటిలైట్ రూ.80 కోట్లు, ఆడియో రైట్స్ రూ.36 కోట్లు. ఇలా మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు రూ.546 కోట్ల బిజినెస్ జరిగింది.
ఈ సినిమాకైన బడ్జెట్ రూ.200 కోట్లు. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా ప్రాఫిట్స్ వచ్చాయి. ఇలా ఒక సినిమా రిలీజ్‌కు ముందే ఈ రేంజ్లో ప్రాఫిట్స్ రావడం అరుదు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా రేంజ్ ఏంటో తెలుస్తుంది. పైగా పఠాన్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో హిందీ నాట మామాలు అంచనాలు లేవు. డైరెక్టర్ సహా టీమ్ మొత్తం అరవ బ్యాచ్ ఉండటంతో ఎలాగూ తమిళంలోనూ హైప్ ఉంటుంది. సెప్టెంబర్ 7న గ్రాండ్ లెవల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.