Jawan Movie Advance bookings | బాలీవుడ్ బాద్షా నటుడు షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’(Jawan). అట్లీ (Atlee) దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (Red Chillies Entertainments) సమర్పణలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై తిరుగులేని హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించి బిగ్ అప్డేట్ను ప్రకటించింది. ఈ సినిమా బుకింగ్స్ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయ్యినట్లు వెల్లడించింది. ఇక ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే పెద్ద మొత్తంలో కలెక్షన్లు వస్తాయని చిత్రబృందం ధీమాగా ఉంది.
Your wait is almost over! The advance bookings for Jawan start in just one hour.🔥#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/6rdDpgUAj0
— Red Chillies Entertainment (@RedChilliesEnt) September 1, 2023
అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుంది. షారుఖ్‌కు జోడీగా నయనతార నటిస్తుంది. హిందీతో పాటు పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సెప్టెంబర్ 7న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. అనురుధ్ రవిచంద్రన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు.