Jawan Movie | ప్రస్తుతం నార్త్ టు సౌత్ థియేటర్లన్నీ జవాన్ సినిమాతో దద్దరిల్లిపోతున్నాయి. జైలర్ తర్వాత అదే స్థాయిలో తెలుగులో ఓ డబ్బింగ్ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తొలిరోజే రూ.65 కోట్ల నెట్ కలెక్ట్ చేసి హిందీ చిత్ర సీమలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక రెండో రోజు అటు ఇటుగా రూ.50 కోట్ల రేంజ్లో వసూళ్లు సాధించి.. రెండు రోజుల్లోనే రెండొందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక శనివారం టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ముందు హౌజ్ ఫుల్ బోర్డులు పడుతున్నాయంటే మాములు విషయం కాదు. అది కూడా ఓ డబ్బింగ్ సినిమాకు.
శని, ఆది వారాల్లో ఎలాగో మరో నూరు, నుటయాభై కలెక్షన్లు ఈజీగా కొల్లగొడతాయి. ఈ లెక్కన చూసుకుంటే ఫస్ట్ వీకెండ్లోనే ఈ సినిమా రూ.400 కోట్లు కొల్లగొట్టనుంది. ఇక ఈ సినిమా ఇంత పెద్ద విజయం కావడంతో జనాలు అసలు సినిమా బడ్జెట్ ఏంటి? ఒక్కో యాక్టర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారని తెగ చర్చలు జరుగుతున్నాయి. కాగా వీటి గురించి ఓ లుక్కేద్దాం.
ఈ సినిమాకైన మొత్తం బడ్జెట్ రూ.300 కోట్లు అని ఇన్సైడ్ టాక్. అది కూడా ప్రమోషన్లు కలుపుకుని. ఇక ఈ సినిమా నిర్మాత షారుఖ్ భార్య గౌరీ ఖాన్ అయినా.. బడ్జెట్లో ఆయన రెమ్యునరేషన్‌ను కూడా లెక్కగడతారు. ఈ లెక్కన షారుఖ్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ.100 కోట్లు.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించినందుకు ఆయనకు రూ.21 కోట్లు ముట్టజెప్పారని తెలుస్తుంది.
ఇక లేడి సూపర్ స్టార్ నయనతార ఈ సినిమా కోసం రూ.10 కోట్లు తీసుకున్నట్లు చెన్నై టాక్.
గెస్ట్ అప్పియరెన్స్‌లో నటించిన దీపికా సైతం రూ.10 కోట్లకు పైగానే తీసుకుందట.
సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ సినిమా కోసం రూ.3 కోట్లు తీసుకున్నాడని తెలుస్తుంది.
ఇక సినిమలో కింగ్ ఖాన్ అమ్మాయిల బ్యాచ్‌లో మేయిన్ అయిన ప్రియమణి, సాన్య మల్హోత్రాలు చెరో రెండు కోట్లు తీసుకున్నారట. ఇలా కేవలం యాక్టర్ రెమ్యునరేషన్ మొత్తం కలిపి రూ. 150 కోట్లు ఖర్చయిందట. మేకింగ్‌కు మరో రూ.150 కోట్లు ఖర్చయింది. ఇలా జవాన్ సినిమాకు మొత్తంగా రూ.300 కోట్ల బడ్జెట్ తేలింది. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమాకు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో రూ.60 శాతానికి పైగా బడ్జెట్ రికవరీ అయిపోయిందని సమాచారం.