సతీష్‌బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జాతర’. రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మాతలు. నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం చిత్ర ట్రైలర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ‘అమ్మోరు తల్లి ఊరు వదిలి వెళ్లిపోయిందహో’ అంటూ దండోరాతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విజువల్స్, యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకున్నాయి. చిత్తూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో జాతర నేపథ్యంలో నడిచే కథాంశమిదని, యాక్షన్ డ్రామాగా మెప్పిస్తుందని చిత్రబృందం పేర్కొంది. దీయారాజ్, ఆర్.కె.నాయుడు, గోపాల్ రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: కెవీ ప్రసాద్, సంగీతం: శ్రీజిత్ ఎడవణ, రచన-దర్శకత్వం: సతీష్‌బాబు రాటకొండ.