మొహాలీ: పంజాబీ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకున్నది. పంజాబీ స్టార్ నటుడు, కమీడియన్ జస్విందర్ భల్లా (Jaswinder Bhalla) కన్నుమూశారు. ఆయన వయసు 70 ఏళ్లు. గత కొన్నాళ్ల నుంచి ఆయన ఆరోగ్యంగా సరిగా లేదు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో ఆయన ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. పంజాబీ చిత్ర పరిశ్రమలో భల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. సినిమాతో పాటు నాటక రంగంలో కూడా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. కామెడీ చిత్రాలు సోషల్ సెటైర్ పాత్రల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాడు. లక్షలాది మంది పంజాబీ అభిమానుల్లో ఆయన ప్రత్యక స్థానం సంపాదించారు. మొహాలీలో బాలోంగి క్రీమేషన్ సెంటర్లో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.