ముంబై, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : షోలాపూర్ మేయర్‌గా తెలుగు వ్యక్తి వినాయక్ రామకృష్ణ కొండ్యాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 102 మంది సభ్యుల్లో బీజేపీకి చెందినవారు 81 మంది గెలుపొందారు. ఈ క్రమంలో 12వ వార్డు కార్పొరేటర్ వినాయక్ రామకృష్ణను మేయర్‌గా ఎన్నుకున్నారు. వినాయక్ బీఏ, ఎల్ఎల్బీ చదివారు.
ఆయన తాత కొండ్యాల సాయన్న నల్లగొండ జిల్లా సూరేపల్లికి చెందిన వారు. వినాయక్ కార్పొరేటర్‌గా 2009, 2012, 2017, 2022లలో ఎన్నికయ్యారు. స్టాండి ంగ్ కమిటీ చైర్మన్‌గా, శాసన కమిటీ చైర్మన్, నిర్మాణ కమిటీ చైర్మన్, మారెట్ అండ్ గార్డెన్ కమిటీ చైర్మన్‌గా ఆయనకు అనుభవం ఉంది.