మోడల్‌గా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టిన జస్వంత్ కొన్నాళ్లు గేమ్ బాగానే ఆడాడు.ముఖ్యంగా సిరి-షణ్ముఖ్‌తో కలిసి కొన్నాళ్లు నెట్టుకొచ్చాడు. అయితే ఆయనకు వర్టిగో’ వ్యాధి ఉండడం వల్ల జెస్సీ గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు.. తినలేకపోతున్నాడు.. సరిగా నడవలేకపోతున్నాడు.. మెడ పట్టుకుని చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. తాజాగా ఆయన కెమెరాలతో తన బాధ చెప్పుకున్నాడు.
సరిగా చూడలేకపోతున్నానని, ఒక వైపుకు నెట్టేసినట్లు పడిపోతున్నానని బిగ్‌బాస్‌కు చెప్పుకున్నాడు జెస్సీ . పడుకున్నప్పుడు స్నేక్ ఉన్నట్లుగా అనిపిస్తుందన్నాడు. దీంతో అతడిని చెకప్ చేసేందుకు డాక్టర్ రాగా.. జెస్సీ తన చేతులు లావైనట్లు అనిపిస్తోందని ఇలా ఇంతకుముందెన్నడూ అనిపించలేదని తెలిపాడు. నీకు మెరుగైన వైద్యం అవరసరమన్న డాక్టర్, అందుకు తగ్గట్టు మంచి ట్రీట్మెంట్ ఇస్తామని, ధైర్యంగా ఉండమని జెస్సీకి భరోసా ఇచ్చాడు.
అయితే జస్వంత్‌కి ఆరోగ్యం బాగోలేదని బయటకు తీసుకు రాగా,ఆయనను 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని చెప్పారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆయన ఇంట్లో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ‘వర్టిగో’ వ్యాధి లక్షణాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి.. తలతిరగడం అనేది ప్రధాన లక్షణం కాగా.. ఇందులో చాలా రకాలు ఉంటాయి. నడుస్తూ ఉన్నప్పుడు ఎదురుగా గుంతలు ఉన్నట్టుగా అనిపించడం.. లోయలో పడిపోతున్నట్టుగా అనిపించడం
, కంటిచూపు మందగించడం.. కళ్లు వాటంతట అవే కదులుతున్నట్టు అనిపిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి.ఇప్పుడు జెస్సీ ఇదే వ్యాధితో ఆవేదన చెందుతున్నాడు.